తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 8:56 AM IST

ETV Bharat / state

విద్యుదాఘాతంతో మూగ జీవాల మృత్యువాత

విద్యుదాఘాతంతో మూగజీవాలు మృతి చెందాయి. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11 కేవీ ఇన్సులేటర్ పగిలి ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

Cattle die due to electric shock in Manchirala district
Cattle die due to electric shock in Manchirala district

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామ శివారులో విద్యుదాఘాతంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. కన్నెపల్లి, ముత్తాపూర్ గ్రామాల రైతులకు చెందిన 12గేదెలు, 2ఎద్దులు చనిపోయాయి.
కన్నెపల్లి విద్యుత్తు ఉపకేంద్రం నుంచి రెబ్బెన గ్రామానికి సరఫరాచేసే 11 కేవీ స్తంభంపై ఇన్సులేటర్ పగిలి ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పశువుల విలువ 5 లక్షల వరకు ఉంటుందని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి విద్యుత్ లైన్​కు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details