తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బ్యాలెట్ పత్రాలు - byalet Papers Leakage in social media

ప్రాదేశిక ఎన్నికలకు చెందిన బ్యాలెట్‌ పత్రాలు ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ యువకుడు ఫొటో తీసి వాటిని పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు దర్యాప్తు చేపట్టారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బ్యాలెట్ పత్రాలు

By

Published : May 7, 2019, 11:04 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన బ్యాలెట్‌ పత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బట్వాన్‌పల్లికి చెందిన ఓ యువకుడు అత్యుత్సాహాంతో ఓటేసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలెట్‌ పత్రాలను చరవాణిలో ఫొటో తీశాడు. వాటిని సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ కావటం వల్ల ఎన్నికల అధికారులు స్పందించారు. ఫొటోలు ఎవరు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారో అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే చరవాణిని పోలింగ్‌ కేంద్రంలోకి ఎవరు అనుమతించారనే దానిపై కూడ విచారణ కొనసాగుతోంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బ్యాలెట్ పత్రాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details