మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రజలు ఉపాధి లేక.. ఆర్థికంగా చితికిపోయిన సమయంలో ఇష్టం వచ్చినట్టు విద్యుత్ స్లాబులు మార్చి.. అధిక బిల్లులు వసూలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల రూ.200 నుంచి రూ.300 వరకు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు వస్తుందన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయని భాజపా మహిళా నాయకురాలు వనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
‘విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి’
మంచిర్యాల విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట భాజపా నేతలు ధర్నా చేశారు. లాక్డౌన్ సమయంలో వసూలు చేస్తున్న విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు బిల్లులు పెంచి బలవంతంగా వసూలు చేయడం సరికాదన్నారు.
‘విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి’