తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్లంపల్లిలో భూకబ్జాదారులపై ఖాకీల కొరడా - bellampalli

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూకబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఏసీపీ బాలు జాదవ్ తెలిపారు. భూ కబ్జాలపై రెవెన్యూ, మున్సిపల్, సింగరేణి అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు.

బెల్లంపల్లిలో భూకబ్జాదారులపై ఖాకీల కొరడా

By

Published : May 11, 2019, 3:15 PM IST

బెల్లంపల్లిలో భూకబ్జాదారులపై ఖాకీల కొరడా

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని వివిధ బస్తీల్లో కబ్జాదారులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఏసీపీ బాలు జాదవ్​ తెలిపారు. పట్టణానికి చెందిన ఏలూరి వెంకటేష్, బత్తుల సుదర్శన్, ఎండి అప్జల్, చింతపండు శ్రీనివాస్, ఎస్ కె. యూసుఫ్, పత్తిపాక రాజ్ కుమార్, బి.రాజేశ్వర్, కన్నయ్య సింగ్, తేజ్ ప్రకాష్ అగర్వాల్, నగేశ్​లు కబ్జాకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు వచ్చిందని వెల్లడించారు. భూ కబ్జాలపై రెవెన్యూ, మున్సిపల్, సింగరేణి అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details