మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలో గత నాలుగు సంవత్సరాలుగా సుమారు 28.3 లక్షల మొక్కలు నాటడం జరిగిందని సింగరేణి ఏరియా జీఎం కొండయ్య వివరించారు. 2019లో 490 ఎకరాలలో 8,16,000 మొక్కలను నాటేందుకు ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. ఈ మొక్కల సేకరణకు సింగరేణి వ్యాప్తంగా తమ సొంత నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 5వ విడత హరితహారంలో భాగంగా గోలేటి క్రాస్ రోడ్డు వద్ద సీహెచ్పీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, బెల్లంపల్లి ఏరియా తెలంగాణ బొగ్గుగని వైస్ ప్రెసిడెంట్ మల్లాజ్ శ్రీనివాస్ రావు, ఎంపీపీ దుర్గం శ్రీదేవి, జడ్పీటీసీ వేముల సంతోష్, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో 5వ విడత హరితహారం - బెల్లంపెల్లి
రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణంలో అడవులు 25.16 శాతంగా ఉన్నాయి. 33% స్థాయికి పచ్చదనం పెంచడానికి హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటి సంరక్షించాలని ప్రతినబూనింది.
బెల్లంపల్లి ఏరియాలో 5వ విడత హరితహారం