మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మార్కెట్ పూల వనంగా మారింది. సద్దుల బతుకమ్మ కావడంతో పూల మార్కెట్ కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి రకరకాల పూలు మార్కెట్లోకి వచ్చాయి. పూల ధరలు ఆకాశానికి అంటడం వల్ల మహిళలు ఆచితూచి కొంటున్నారు. బంతి పూలు కిలోకు 120 రూపాయలు పలికాయి.
పూల వనంగా మారిన బెల్లంపల్లి..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పూల వనంగా మారింది. ఎక్కడ చూసిన పూలే కనిపిస్తున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చడానికి ఆడపడుచులు సిద్ధమయ్యారు.
బంతి పూలు