కార్పొరేట్ క్షౌరశాలలకు వ్యతిరేకంగా నాయి బ్రహ్మణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ కులవృత్తిని కాపాడాలంటూ మంచిర్యాల జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నెలరోజులుగా దుకాణాలు తెరవకుండా నిరసన దీక్ష చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు.
కార్పొరేట్ క్షౌరశాలలు మూసేయాలంటూ ఆందోళన
తమ కులవృత్తిని కాపాడాలంటూ నాయి బ్రాహ్మణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ క్షౌరశాలలు మూసివేయాలంటూ మంచిర్యాల జిల్లాకేంద్రంలో ఆందోళనకు దిగారు. ఐబీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు.
మంచిర్యాలలో ర్యాలీ నిర్వహించిన నాయి బ్రాహ్మణులు
రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు తమ నిరసనకు మద్దతు తెలిపారని వెల్లడించారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని నాయి బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నాయిబ్రాహ్మణుల కుల వృత్తులపై ప్రత్యేక జీవోను తీసుకురావాలని డిమాండ్ చేశారు.