అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పురపాలికలోని చౌరస్తాలో విగ్రహానికి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దివాకర్‌రావు పులమాలలు వేసి నివాళులర్పించారు. భవిష్యత్ తరాలకు ఆయన ఆశయాలను అందించాలని అన్నారు. బడుగు వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఎంపీ కొనియాడారు.
'అంబేడ్కర్ ఆశయాలను భావితరాలకు అందించాలి' - మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దివాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేశారు.
'అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు అందించాలి'
మహిళ సమానత్వ చట్టాలు, హక్కుల కోసం ఆయన పోరాడారని తెలిపారు. దేశంలో నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన చేశారన్నారు. ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి, దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి పేద ప్రజలకు అండగా నిలిచారని ఎమ్మెల్యే దివాకర్‌రావు వ్యాఖ్యానించారు.