మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి బొగ్గు గనుల జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ధర్నా
బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి బొగ్గుగనుల జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ధర్నా
ఏఐటీయూసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని.. భవిష్యత్తులో మరింత ఉద్ధృతంగా ఉద్యమాలు చేస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.
ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!