తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న జరిమానాల పరంపర - Manchiryal fines

నెల రోజుల ప్రణాళికలో భాగంగా మంచిర్యాల జిల్లాలో జరిమానాల పరంపర కొనసాగుతోంది. రోడ్డుపై చెత్త వేసిన ఓ కళాశాల యాజమాన్యానికి పంచాయతీ అధికారులు రూ. 5వేల జరిమానా విధించారు.

జరిమానాల పరంపర

By

Published : Sep 27, 2019, 9:39 PM IST


మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలో రోడ్డు పక్కన బహిరంగంగా చెత్త, కుళ్లిపోయిన పదార్థాలు వేసిన సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యానికి పంచాయతీ అధికారులు రూ. 5వేల జరిమాన విధించారు. కోమల్ సిరామిక్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రాగా.. సదరు యజమానికి రూ. 2 వేల జరిమాన విధించినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి సర్దార్ అలీ తెలిపారు. ఇందుకు సంబంధించిన రశీదులను వారికి అందజేశారు. ఇప్పటికే బహిరంగంగా మలవిసర్జన చేసిన చెంబు రాజాకు రూ. 500 జరిమానా విధించిన విషయం తెలిసిందే.

కొనసాగుతున్న జరిమానాల పరంపర

ABOUT THE AUTHOR

...view details