రాత్రి సమయాల్లో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అరవింద్ అనే వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లోనూ పలు చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని డీసీపీ సంప్రీత్సింగ్ తెలిపారు. గతంలో నిందితుడిపై 17 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
రాత్రి వేళల్లో చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ - a man arrested who did crime in nigh time
రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న.. మంచిర్యాలకు చెందిన వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.10లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ. 5వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
రాత్రి వేళల్లో చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ. 5వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేశారు.
ఇవీచూడండి:పిల్లలను విక్రయిస్తున్న ముఠా పట్టివేత