మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నూరుకు చెందిన సాయితేజ, పవన్ స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ స్కూటీని ఢీకొట్టింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్ని ఇసుక లారీ... ఇద్దరు యువకుల మృతి - bike accident
స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన ఇసుక లారీ బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట సమీపంలో జరిగింది. చెన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా... కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇద్దరు యువకులను బలితీసుకున్న ఇసుక లారీ
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాయితేజ, పవన్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం కారణంగా రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.