అంతర్జాలంలో యువతుల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షిస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ.శివకుమార్ (27) దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ... ప్రైవేటు వ్యాపారం చేస్తున్నాడు. తన మిత్రుడు చిన్నాతో కలిసి ఏడాది క్రితం అంతర్జాలం ద్వారా వ్యభిచార కార్యకలాపాలు ప్రారంభించాడు.
హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్న యువకుడు అరెస్ట్
హైదరాబాద్‌లో వ్యాపారం అతని వృత్తి. కానీ... యువతుల ఫొటోలు అంతర్జాలంలో పెట్టి విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహించటం అతని ప్రవృత్తి. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను కాంట్రాక్టు పద్ధతిన నగరానికి తీసుకొచ్చి... ఈ యవ్వారాన్ని నడుపుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన ఆ యువకున్ని, ఇద్దరు అమ్మాయిలను పోలీసులు పట్టుకున్నారు.
Young man arrested for running hi-tech prostitution in hyderabad
బెంగాల్, ముంబయి నుంచి వ్యభిచార నిర్వాహకుల ద్వారా యువతులను కాంట్రాక్టు పద్ధతిలో హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఆ అమ్మాయిల ఫొటోలు అంతర్జాలంలో పెట్టి విటులను ఆకర్షిస్తూ... డబ్బు సంపాదిస్తున్నారు. వీరి కార్యకలాపాలను పసిగట్టిన మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు... నేరేడ్‌మెట్ వాయుపురిలో దాడులు నిర్వహించారు. శివకుమార్‌తోపాటు మరో ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. వారిని నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు.