మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పార్థివదేహాన్ని మహబూబ్‌నగర్‌లోని ఆయన స్వగృహనికి తీసుకొచ్చారు. నారాయణ గౌడ్ పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ గౌడ్ తండ్రి మృతి పట్ల ప్రముఖుల సంతాపం - మహబూబ్‌నగర్ జిల్లా తాజా వార్తలు
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతి పట్ల పలువురు మంత్రులు, నేతలు సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లో నారాయణ గౌడ్ మృతి చెందగా పార్థివదేహాన్ని మహబూబ్‌నగర్‌లోని ఆయన స్వగృహనికి తీసుకొచ్చారు.
శ్రీనివాస్ గౌడ్ తండ్రి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
భౌతికదేహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించి నివాళి అర్పించారు. ఎంపీ కె.రాములు, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, డా.లక్ష్మారెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, సహా పలువురు నేతలు అంజలి ఘటించారు.
ఇదీ చదవండి:సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నాగార్జునసాగర్