మహబూబ్‌నగర్ జిల్లా మిడ్డిల్ మండలం తండాకు చెందిన రవినాయక్(20) హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కాళీ సమయాల్లో పెళ్లిళ్లకు ఫొటోలు, వీడియోలు తీయడానికి వెళ్తుంటాడు. జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల పంచాయతీలోని తూర్పుగడ్డ తండాలో జరుగుతున్న వివాహానికి ఫొటోలు తీసేందుకు రవినాయక్ వెళ్లాడు.
పెళ్లి ఫొటోలు తీసేందుకు వెళ్లి.. యువకుడి మృతి - CRIME NEWS IN TELANGANA"
కాసేపట్లో వివాహం జరగాలి. అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఫొటోలు తీసేందుకు వచ్చిన అబ్బాయి తన సరంజామ అంతా అమర్చుకున్నాడు. ఇక పెళ్లి తంతు మొదలవుతుందన్న సమయంలో లైట్లు వేసేందుకు వెళ్లాడు. మళ్లీ తిరిగిరాలేదు. విద్యుదాఘాతం రూపంలో మృత్యువు అతన్ని కబళించింది.
VIDEO AND PHOTOGRAPHER DIED WITH CURRENT SHOCK IN WEDDING
ఫొటోలు, వీడియోల కోసం లైటింగ్ పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగలగా అక్కడికక్కడే మృతి చెందాడు. వివాహం జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ ఘటన జరగటం వల్ల పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.