లాక్‌డౌన్‌తో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యాక్సినేషన్‌పై ప్రభావం పడుతోంది. ప్రారంభంలో ఒక్కోరోజు గరిష్ఠంగా 20 వేల నుంచి 30 వేల డోసుల వరకూ ఇచ్చారు. 45 ఏళ్లకు పైబడిన వాళ్లకు, కేవలం రెండో డోసు ఇచ్చే సందర్భంలోనూ నిన్నమొన్నటి వరకూ 5 వేల నుంచి 10 వేల డోసులు ఇచ్చారు. కానీ లాక్డౌన్ సందర్భంగా ఈ సంఖ్య గణనీయంగా పడిపోయింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇవాళ కేవలం 328 డోసులు, నాగర్ కర్నూల్ జిల్లాలో 150 డోసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 110 డోసులు, నారాయణపేట జిల్లాలో 72 డోసులు, వనపర్తి జిల్లాలో 49 డోసులు అందించారు. నిన్న మహబూబ్‌నగర్ జిల్లాలో 1,500లకు పైగా డోసులు, నాగర్ కర్నూల్లో 1,328 డోసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 558 డోసులు, వనపర్తి జిల్లాలో 892 డోసులు అందించారు.