Udandapur Reservoir Lands Issue in Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Ranga Reddy Project) కింద నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయం కింద ఉదండపూర్, వల్లూరు సహా 7తండాలకు చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయారు. ముంపు పేరుతో భూముల్ని అధికారులు సేకరించినా, జలాశయం నిర్మాణం తర్వాత అవి ముంపులో లేకుండా మిగిలి పోయాయి. దీంతో భూములు కోల్పోని రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పరిహారాన్ని ఇచ్చేస్తామని భూములు తిరిగి తమ పేరిట ఇవ్వాలని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేశారు. తహసీల్దార్, ఆర్డీఓ, ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా భూములు వారికి దక్కలేదు. తాజాగా ఆ భూములు తమవని, అందులోకి రావద్దని కొందరు రంగప్రవేశం చేసి గొడవలకు దారితీసింది.
'కొంత భూమి రోడ్డుకు పోయింది.. ఉన్నకొంచెం ఆన్లైన్ కాలేదు'
Udandapur Reservoir Lands Possession: 145 సర్వే నెంబర్లో భీమ్లాకు చెందిన రెండెకరాలు, పుల్యానాయక్ సోదరులకు చెందిన నాలుగున్నర ఎకరాలు జలాశయం కట్టకు ఆవల మిగిలి పోయాయి. వారు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. కాని అది వారి భూమే కాదని, ముంపులో పోయిందని కొందరు తమ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకే సర్వే నెంబర్ పేరుతో విలువైన భూముల్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని భాధితులు ఆరోపిస్తున్నారు. 94వ సర్వే నంబరులో సాయిలుకు 3.39 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తండ్రి చెన్నయ్య పేరు మీద ఉంది. జలాశయంలో ముంపునకు గురవుతుందని అవార్డు పాసు చేసి రూ.25 లక్షల చెక్కు సిద్ధం చేశారు. కాని ఆ చెక్కు తీసుకునేందుకు రైతు నిరాకరించారు. తీరా చూస్తే వారి భూములు ముంపునకు బైటే ఉన్నాయి.