పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లారు. కానీ పిడుగు రూపంలో మృత్యువు వారిని కబళించింది. వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం బంగారంపల్లిలో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు ఎల్లమ్మ(32), వెంకటమ్మ(38)ల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకరికి ముగ్గురు సంతానం కాగా... మరొకరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి - పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
పొట్ట కూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలు పిడుగు పడి మృతి చెందిన విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లా బంగారంపల్లిలో చోటుచేసుకుంది.
పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి