సమర భేరీకి అనుమతి ఇవ్వకపోయినా.. ప్రభుత్వం ఎన్ని అంక్షలు విధించినా సభను విజయవంతం చేసి తీరుతామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. మమబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపోను ముట్టడించారు. అక్కడే మౌనం పాటించి మృతి చెందిన కార్మికులకు నివాళులు అర్పించారు. అనరంతరం పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అటుగా వచ్చిన జిల్లా పరిషత్ ఛైర్మెన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని విన్నవించారు.
'ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదిలేదు' - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019
రేపు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో సమరభేరిని తలపెట్టింది. ఈ సమావేశాన్నికి ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఎన్ని అంక్షలు పెట్టి... అడ్డంకులు సృష్టించినా సభకు తరలి వెళ్లి విజయవంతం చేసి తీరుతామని మహబూబ్‌నగర్‌లో కార్మికులు స్పష్టం చేశారు.
'ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గాం'
Last Updated : Oct 29, 2019, 11:04 PM IST