తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్చర్లలో రైలు ఢీకొని వ్యక్తి మృతి - train accident at Jadcharla in Mahabubnagar district

పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొనటం వల్ల వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

train accident at Jadcharla in Mahabubnagar district
జడ్చర్లలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Dec 31, 2019, 9:38 AM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మహబూబ్​ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్థానికంగా కార్మిక పని చేస్తూ జీవినం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పొవటం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జడ్చర్లలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details