నిజాం కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కేంద్రానికి రహదారిని నిర్మించి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను పటిష్టం చేశారు. అనంతరం జరిగిన రైల్వే మార్గాల విస్తరణతో ఏర్పాటుచేసిన రైల్వే గేట్పై ఆర్వోబీ నిర్మాణం జరగక స్థానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిత్యం రద్దీగా...
నిత్యం దేవరకద్ర మీదుగా కాచిగూడ- కర్నూల్ మధ్య సుమారు 45 రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఉదయం సమయంలోనే కనీసం 25 రైళ్లు వెళ్తుంటాయి. ఆ సమయంలో కనీసం 10 నుంచి 40 నిమిషాలపాటు గేట్ వేస్తుంటారు. ఈ రహదారిపై నిత్యం హైదరాబాద్ నుంచి కర్ణాటక లోని ప్రధాన పట్టణాలకు, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. హైదరాబాద్ నుంచి నారాయణపేట , వనపర్తి , మహబూబ్ నగర్ జిల్లా వాసులు దేవరకద్ర మీదుగా వెళ్తుంటారు.