మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ముందు రోడ్డు భాగం శిథిలావస్థకు చేరుకుంది. రోడ్డు గుంతలు పడి నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రహదారిపై దేవరకద్ర నుంచి నారాయణపేట కోడంగల్ నియోజకవర్గాలకు రైతులు, వ్యాపారులు పశువుల రవాణా కొనసాగుతుంటుంది.
ఆనకట్టకు ప్రమాదం..
ఆనకట్టకు ఆనుకుని ఉన్న రహదారి ఐదేళ్ల నుంచి ఆనకట్ట అడుగుభాగం రాళ్లు తేలి గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. మరమ్మతులు చేయకపోతే కట్టకు సైతం ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. అధికారులు ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి.. ప్రాజెక్టు ఆనకట్ట ముందు మరమ్మతులు చేపట్టాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.