వివాహం జరిగినప్పటి నుంచి.. కలిసి జీవించారు. ఒకరి మరణం తట్టుకోలేక మరొకరు మృతి చెందారు. చివరకు ఒకేచోట చితిమంటల్లో ఇద్దరు కలిసిపోయిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీలోని సోది కుంట తండాలో చోటుచేసుకుంది. సోదికుంట తండాకు చెందిన ఖిర్య నాయక్ సోమవారం రాత్రి మృతిచెందాడు. భర్త మరణం తట్టుకోలేక కన్నీరు మున్నీరైన అతని భార్య దేవుళి అక్కడే కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఇంటికి తీసుకెళ్లడం ఉత్తమమని వైద్యులు చెప్పగా.. ఈరోజు మధ్యాహ్నం ఇంటికి తీసుకువచ్చారు. కాసేపటికే భర్త మృతదేహం పక్కనే భార్య కూడా తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన తండవాసులందరినీ కలిచివేసింది. ఇద్దరికీ ఒకేసారి తండాలో శవయాత్ర నిర్వహించి.. వారి పొలంలో దహన సంస్కరాలు పూర్తి చేశారు.
చావులోనూ వీడని బంధం.. భర్త మృతితో ఆగిన భార్య గుండె - husband
భర్త మరణాన్ని ఆ భార్య తట్టుకోలేకపోయింది. బోరున విలపించింది. ఏడ్చి ఏడ్చి భర్త శవంపై కుప్పకూలింది. వెంటనే బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
భర్త మృతితో ఆగిన భార్య గుండె