తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుగ పూట విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం - పండుగ పూట విషాదం ప్రాణం తీసిన గాలిపటం

సంక్రాంతి పండుగ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదానికి గురై పసివాడి ప్రాణాలు వదిలిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరిగింది.

The boy kills the kite flying at Jadcharla in Mahabubnagar district
పండుగ పూట విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం

By

Published : Jan 15, 2020, 8:31 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో గౌరీశంకర్‌ కాలనీలో నివాసం ఉంటున్న గణేశ్‌ తన ఆరేళ్ల కుమారుడు కార్తీక్‌తో కలిసి భవనంపై నుంచి గాలి పటం ఎగురవేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో గాలిపటం పక్కింటి మేడపై చిక్కుకుంది. ఆ గాలిపటాన్ని తీసి కుమారుడికి అందించాడు.

ఇంటిపైకి చేరుకొన్న తర్వాత దానిని పైకి ఎగురవేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో కార్తీక్ భవనం నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగ పూట బాలుడు మృతి చెందటం వల్ల ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

పండుగ పూట విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం

ఇవీచూడండి: చాటింగ్​ చేస్తూ భవనంపై నుంచి పడి ఎయిర్​పోర్టు ఉద్యోగిని మృతి

ABOUT THE AUTHOR

...view details