హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ రైల్వే డబుల్ లైన్ పనులను 2020 లోపు పూర్తిచేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. ఇవాళ ప్రత్యేక రైలులో ఆయన హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు వెళ్లి పనులను పరిశీలించారు. జడ్చర్ల రైల్వే స్టేషన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నిర్మించనున్న రైల్వే వంతెనపై స్థానికుల అభిప్రాయాలను సేకరించారు. మహబూబ్‌నగర్ వరకు త్వరలోనే డబుల్ లైన్ పూర్తవుతుందని రైల్వే జీఎం చెప్పుకొచ్చారు. రైల్వే డీఆర్ఎంతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, గొల్లపల్లి, జడ్చర్ల , అప్పనపల్లి , మహబూబ్ నగర్ స్టేషన్ల వద్ద కొనసాగుతున్న పనులను ప్రత్యేక రైలులో పరిశీలించారు. అనంతరం రైల్వే ఇంజనీర్లకు సూచనలు, సలహాలు అందించారు.
త్వరలోనే మహబూబ్ నగర్ డబుల్ లైన్ పూర్తి : జీఎం - RAILWAY DRM
మహబూబ్ నగర్ రైల్వే డబుల్ లైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని రైల్వే జీఎం తెలిపారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్‌కు ప్రత్యేక రైలులో బయలుదేరిన జీఎం మధ్యలో జడ్చర్ల రైల్వే స్టేషన్‌ని పరిశీలించారు.
కొనసాగుతున్న రైల్వే పనులు