తెలంగాణ

telangana

ETV Bharat / state

Tiger wandering Nallamala forest : రహదారిపై పులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు - తెలంగాణ వార్తలు

Tiger wandering Nallamala forest : నల్లమల అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ప్రయాణికులకు.. రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించింది. వాహనదారులు తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

రహదారులపై పులి సంచారం

By

Published : Dec 4, 2021, 11:20 AM IST

Tiger wandering Nallamala forest : నల్లమల అటవీ ప్రాంతం హైదరాబాద్, శ్రీశైలం ప్రధాన రహదారిపై పెద్దపులి కలకలం రేపింది. మహబూబ్​నగర్ జిల్లా గుండం సమీపంలో మల్లాపూర్ చెంచులకు రోడ్డు దాటుతుండగా పులి కనిపించింది. పులి సంచరిస్తున్న వీడియోను మల్లాపూర్ గ్రామస్థుడు తన సెల్ ఫోన్​లో చిత్రీకరించారు.

పాద ముద్రలు గుర్తింపు

పులి సంచారం విషయాన్ని మన్ననూరు రేంజ్ అటవీ అధికారి ఈశ్వర్ ధ్రువీకరించారు. గుండం ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు కనిపించినట్లుగా సిబ్బంది చెప్పారని ఆయన తెలిపారు. హైదరాబాద్​కు వెళ్లిన కొంతమంది... రాత్రి స్వగ్రామానికి బస్సులో వస్తుండగా అటవీ ప్రాంతంలో పెద్దపులి రహదారి దాటుతూ కనిపించినట్లుగా తెలుస్తోంది. బస్సులో ప్రయాణించే ఓ వ్యక్తి పెద్దపులి కదలికలను వీడియోలో బంధించారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

అక్కడ కూడా పెద్దపులి సంచారం

జయశంకర్ భూపాలపల్లి మహముత్తారం మండలం ఉట్లపల్లి గ్రామ సమీపంలో పెద్దపులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పల్లెప్రకృతి వనంవైపు వెళ్తుండగా పెద్దపులి అడుగులను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అజాంనగర్ ఎఫ్​ఆర్​వో దివ్య సిబ్బందితో పులి సంచరించిన ప్రదేశానికి చేరుకొని అడుగులను పరిశీలించారు.

అప్రమత్తంగా ఉండండి..

పెద్దపులి అడుగులేనని ప్రజలకు ఎఫ్​ఆర్​వో దివ్య తెలియజేశారు. పొలారం, ఉట్లపల్లి గ్రామాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. పశువులను కూడా అడవిలోకి తీసుకెళ్లకూడదని చెప్పారు. పులిని వేటాడేందుకు విద్యుత్ వైర్లు, ఉచ్చులు వంటివి పెడితే చట్టప్రకారం జీవిత ఖైదు తప్పదని హెచ్చరించారు. డీఆర్​వో ఆదిల్, బీట్ అధికారి చంద్రశేఖర్​పాటు బేస్ క్యాంప్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

రహదారులపై పులి సంచారం

ఇదీ చదవండి:Karnataka bus overturns: నారాయణపేటలో కర్ణాటక బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details