తెలంగాణ

telangana

ETV Bharat / state

'పదేళ్లలో పాలమూరు పరిపూర్ణ ప్రగతి సాధిస్తుంది' - మహబూబ్​నగర్​ ఐటీ టవర్

తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వాళ్లకు నేడు పాలమూరు జిల్లా సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధే  ఓ సమాధానమని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్​నగర్​లో​ ఐటీ టవర్ శంకుస్థాపన

By

Published : Oct 31, 2019, 6:18 PM IST

మహబూబ్​నగర్​లో​ ఐటీ టవర్ శంకుస్థాపన

పాలమూరు జిల్లా యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా మహబూబ్​నగర్​లో ఐటీ టవర్ ​ ఏర్పాటు చేస్తున్నామని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. ఐటీ పారిశ్రామిక క్లస్టర్, ఐటీ టవర్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఐటీ టవర్​ను రూ.50కోట్ల వ్యయంతో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వలసల జిల్లా పాలమూరు ముఖ చిత్రాన్ని మార్చడమే అంతిమ లక్ష్యమన్నారు. పదేళ్లలో పాలమూరు జిల్లా పరిపూర్ణంగా ప్రగతి సాధించాలనే రాత్రింబవళ్ళు కష్టపడుతున్నామని చెప్పారు. సంవత్సరంలోపే టవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details