'రైతులను రెచ్చగొట్టి.. పత్తా లేకుండా పోయారు' - minister niranjan reddy interview
Niranjan Reddy Interview: యాసంగిలో వరి సాగు చేయొద్దని తాము రైతులకు చెప్పామని.. కానీ భాజపా మాత్రం కర్షకులను రెచ్చగొట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యాన్ని తాము కొనిపిస్తామని అప్పుడు చెప్పి.. ఇవాళ పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు. తెలంగాణలో కేంద్ర సర్కార్ నేరుగా వడ్లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే సేకరించాలని కోరారు. లేనియెడల రైతుల ఆగ్రహాన్ని దిల్లీ పాలకులకు చూపిస్తామని హెచ్చరించారు.
Niranjan Reddy Interview : ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం వినిపించుకోవట్లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిలో తెలంగాణ ఎదిగిందన్న ఆయన.. యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు తాము ముందే చెప్పామని వివరించారు. రాష్ట్ర భాజపా నేతలే రైతులను రెచ్చగొట్టారన్న మంత్రి.. ధాన్యాన్ని తాము కొనిపిస్తామని భాజపా నేతలు అన్నారని విమర్శించారు. ధాన్యాన్ని కొనిపిస్తామన్న భాజపా నేతలు ఇవాళ కనిపించట్లేదని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఆరోపించారు.