మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెదేపా పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. దోపిడి వ్యవస్థను, కుటుంబ పాలనతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి సమాయత్తమవుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్ అన్నారు. ఎంత మంది నాయకులు బయటకు వెళ్లినా.. కార్యకర్తలు అండగా నిలబడ్డారని తెలిపారు. భవిష్యత్‌లో బలమైన శక్తిగా తెలుగుదేశం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెరాసలో ఓనర్షిప్ పంచాయితీ నడుస్తోందని.. రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్‌లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం - telangana tdp
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. కుటుంబ పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలుగు తమ్ముళ్లు సిద్దమవుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్ తెలిపారు.
మహబూబ్‌నగర్‌లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం