జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, జడ్పీటీసీలకు ప్రత్యేక అధికారులు కల్పించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. జడ్పీ ఛైర్మన్‌గా స్వర్ణ సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వీరితో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వైస్ ఛైర్మన్, జడ్పీటీసీ, కో ఆప్షన్ సభ్యులు ప్రమాణం చేశారు. సమస్యల పరిష్కారంలో నిస్పక్షపాతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలని మంత్రి నూతన స్థానిక ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్ జడ్పీ ఛైర్మన్‌గా స్వర్ణ ప్రమాణం - zp chairman
మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జడ్పీ ఛైర్మన్‌గా స్వర్ణ సుధాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
స్వర్ణ సుధాకర్ రెడ్డి