విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా విద్యాసంస్థలను ప్రారంభించి.. ఎన్నికలు ముగియగానే మూసివేసిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఇప్పుడు మూసి వేయడంతో విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారని వాపోయారు. కళాశాలలు తెరిచిన కొంత కాలంలోనే విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి 75 శాతం ఫీజులు వసూలు చేశాయన్నారు.