తెలంగాణ

telangana

ETV Bharat / state

రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య - latest crime news in devarakadra mahabubnagar

8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Student commits suicide by falling under train in devarakadra mahabubnagar
రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Feb 27, 2020, 9:59 AM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అంకిత(14) ఆత్మహత్యకు పాల్పడింది.

అంకిత బుధవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో దేవరకద్రలోని ఎస్సీ కాలనీ ఆర్​యూబీ వంతెన సమీపంలో కాచిగూడ నుంచి కర్నూల్​ వైపు వెళ్తున్న గూడ్స్​ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై రాఘవేంద్రగౌడ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య

ఇదీ చూడండి: పరీక్షల భయంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details