తెలంగాణ

telangana

ETV Bharat / state

గుంపులుగా ఉంటే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కొందరు ప్రార్థనాలయాలకు తాళాలు వేసి లోపల గుంపులుగా ఉంటున్నారని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించక తప్పదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కరోనా నియంత్రణ కోసం అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుంటే వాటికి విఘాతం కలిగించేలా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు.

Strict action if in group members Minister Srinivas Goud comments at mahabubnagar
గుంపులుగా ఉంటే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : Apr 4, 2020, 7:31 PM IST

మహబూబ్​నగర్​లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ వార్డును మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ముందుగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, ఆరోగ్య కిట్లను ఆయన అందజేశారు. లాక్​డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న శ్రమ గొప్పదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ విధుల్లో ఉన్నప్పుడు మాస్క్​లు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

మహబూబ్​నగర్ పట్టణంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని కోరారు. 100 శాతం లక్​డౌన్ పాటించాలన్నారు. విచ్చలవిడిగా బయట తిరిగితే ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

గుంపులుగా ఉంటే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇదీ చూడండి :మాయదారి మనిషిని నేను అంటున్న ఎస్పీ బాలు

ABOUT THE AUTHOR

...view details