తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒలంపిక్ అసోసియేషన్‌ కార్యదర్శికి మంత్రి నివాళులు - గుండె పోటు కారణాలు

అనారోగ్యంతో మృతి చెందిన మహబూబ్‌నగర్‌ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్‌ కార్యదర్శి అంత్యక్రియలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

telangana sports minister
telangana sports minister

By

Published : Jun 2, 2021, 5:12 PM IST

గుండె పోటుతో మృతి చెందిన మహబూబ్‌నగర్‌ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్‌ కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ మృతదేహానికి.. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాజేంద్రప్రసాద్‌ మృతి.. క్రీడా రంగానికి తీరని లోటు అంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో క్రీడా రంగం అభివృద్ధి కోసం అతను చేసిన కృషి
మరువలేనిదన్నారు.

ఇదీ చదవండి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్న స్థానికులు

ABOUT THE AUTHOR

...view details