హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దాటగానే బస్సు వెనుక భాగంలో ఆయిల్ లీకై పొగలు వచ్చాయి. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒక్కసారిగా పొగ రావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ షకీల్కి చెప్పి బస్సు ఆపేయించారు. ప్రయాణికులంతా గాబరా పడుతూ... హడావుడిగా బస్సు తిగారు.
అర్ధరాత్రి బస్సులో పొగలు...ప్రయాణికుల పరేషాన్ - హబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దాటగానే ప్రైవేటు బస్సులో పొగలు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దాటగానే... అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సులో నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు దిగి... మరో బస్సులో ఇళ్లకు వెళ్లిపోయారు.
అర్ధరాత్రి బస్సులో పొగలు...ప్రయాణికుల పరేషాన్
అందరూ ఒకే సారి దిగే ప్రయత్నం చేయగా... కొందరు గాయపడ్డారు. అయినప్పటికీ అందరూ క్షేమంగా బయటకొచ్చి ఊపిరి పీల్చుకున్నారు. బస్సులు ఎలాంటి మంటలు వ్యాపించకపోయినప్పటికీ... వేరే బస్సు వచ్చే వరకూ వేచి చూశారు. దాదాపు 3 గంటలపై నిరీక్షించి వేరే బస్సులో బయలుదేరారు.