తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలబ్రహ్మేశ్వరుడికి భక్తితో

పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నీరు, పుష్పం, పత్రి, పండ్లతో ప్రత్యేక పూజలందుకుంటున్నాడు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని మహారుద్రుడు.

బాలబ్రహ్మేశ్వరుడికి భక్తితో

By

Published : Mar 4, 2019, 9:35 AM IST

బాలబ్రహ్మేశ్వరుడికి భక్తితో
ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో శివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలైన ఉమా మహేశ్వరం, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. అభిషేకాలు, అర్చనలు, పుష్పాభిషేకాలతో మహాశివుడిని కొలుస్తున్నారు. ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి పాలు,పెరుగు, తేనె, నెయ్యి, నీటితో అభిషేకాలు చేస్తున్నారు. పూలు, పండ్లు, పత్రి సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. భక్తలు వేల సంఖ్యలో హాజరైనందున నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తీర్ధ ప్రసాదాలు, అన్నదానం సహా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:ఎందుకు ఉపవాసజాగరణ?

ABOUT THE AUTHOR

...view details