తెలంగాణ

telangana

ETV Bharat / state

జాయింట్​ చెక్​పవర్​ వద్దు..! సర్పంచ్​ల కన్నెర్ర..

సర్పంచ్​, ఉపసర్పంచ్​లకు కలపి జాయింట్​ చెక్​పవర్​ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పది జిల్లాల సర్పంచ్​ సంఘాలు ఆందోళన చేశాయి. పోలీసులు సర్పంచ్​ సంఘం ప్రతినిధులను నిర్బంధించారు. ఆగ్రహించిన సర్పంచ్లు ప్రధాన రహదారిపై రాస్తారోకోతో నిరసన తెలిపారు. ఈ సంఘటన మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది.

జాయింట్​ చెక్​పవర్​ వద్దు..! సర్పంచ్​ల కన్నెర్ర..

By

Published : Aug 3, 2019, 3:08 PM IST

ఉపసర్పంచ్​తోపాటు సర్పంచ్​లకు జాయింట్ చెక్​పవర్​ను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన సర్పంచ్​ సంఘం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహబూబ్​ నగర్​లోని జడ్చర్లలో ఓ ఫంక్షన్​ హాల్​లో శుక్రవారం సమావేశం నిర్వహిస్తున్న సర్పంచ్​ల సంఘం ప్రతినిధులను పోలీసులు నిర్బంధించారు. అటుగా వెళ్తున్న సీఎం కేసీఆర్​ కాన్వాయ్​ను అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీరుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. డీఎస్పీ భాస్కర్ జోక్యం చేసుకొని ఆందోళనను విరమింపజేశారు.

జాయింట్​ చెక్​పవర్​ వద్దు..! సర్పంచ్​ల కన్నెర్ర..

ABOUT THE AUTHOR

...view details