మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్‌లో ఇసుక లారీ ఢీకొట్టి... ఓ రైతు మృతి చెందిన ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే లారీ ఎక్కించి చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
గ్రామానికి చెందిన నర్సింహులు బుధవారం రాత్రి తన పొలం మీదుగా.. దుందుబీ వాగుకు వెళ్తున్న ఇసుక లారీని అడ్డుకున్నాడు. అయినప్పటికీ లారీ ముందుకు దూసుకుపోగా.. లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.