తెలంగాణ

telangana

ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత - alampur tungabhadra pushkaralu news

తుంగభద్ర పుష్కరాలకు పోలీస్​శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్​ను కంట్రోల్ చేస్తున్నారు. భక్తులందరూ కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ పుష్కర స్నానం ఆచరించాల్సిందిగా అధికారులు కోరారు.

తుంగభద్ర పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత
తుంగభద్ర పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత

By

Published : Nov 20, 2020, 12:08 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా అలంపూర్​లోని తుంగభద్ర పుష్కరాలకు పోలీస్​శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఘాట్​కు మూడు వందల మీటర్ల దూరంలో నాలుగు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లో నిలిపి అక్కడి నుండి పుష్కరఘాట్​కు నడుచుకుంటూ వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మస్కు లేని వాళ్లను అనుమతించడం లేదు.

తుంగభద్ర పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత

ఎక్కడికక్కడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్​ను కంట్రోల్ చేస్తున్నారు. తుంగభద్ర పుష్కరాలకు సుమారు రెండు వేల సిబ్బందిని నియమించారు. పుష్కరఘాట్​ను ఎమ్మెల్యే అబ్రాహం దేవాలయ ఛైర్మన్ రవి గౌడ్ పరిశీలించారు. తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ పుష్కర స్నానం ఆచరించాల్సిందిగా అధికారులు కోరారు.

తుంగభద్ర పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత

ఇదీ చూడండి: వాళ్లు కూడా చదువుకోవాలని... స్మార్ట్​ ఫోన్​లు ఇస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details