తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది - ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా

రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. జీతం లేక ఇళ్లు గడవడం కష్టమైంది. ఈనెల ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నా... వేతనాలు ఇవ్వకపోవడంతో... మహబూబ్​నగర్​లో ఆర్టీసీ సిబ్బంది అంతా ఆందోళన బాట పట్టారు. ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని ఒప్పందం ఉన్నప్పటికీ... యాజమాన్యం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు.

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది

By

Published : Aug 14, 2019, 5:43 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో తొమ్మిది డిపోల పరిధిలో నాలుగు వేల 290మంది ఉద్యోగ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు 8కోట్ల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యాజమాన్యం రెండు మాసాలుగా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. దీనితో ఇళ్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:
తమకు ప్రతినెల సకాలంలో అందాల్సిన వేతనాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి దినం రాలేదని... ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది
ఆందోళన ఉద్ధృతమే: ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని... లేనిపక్షంలో బస్సులను నిలిపివేసి సమ్మేబాట పడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు నెలసరి వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు.ఇదీ చూడండి: జమ్ములో ఆంక్షల ఎత్తివేత- కశ్మీర్​లో పాక్షికంగా అమలు

ABOUT THE AUTHOR

...view details