తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2020, 5:02 AM IST

ETV Bharat / state

'రైతు సగర్వంగా తలఎత్తుకునేలా సర్కారు చర్యలు'

మహబూబ్​నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద పత్తి కొనుగోలు కేంద్రం, కోటకదిరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్​గౌడ్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు.

'రైతు సగర్వంగా తలఎత్తుకునేలా సర్కారు చర్యలు'
'రైతు సగర్వంగా తలఎత్తుకునేలా సర్కారు చర్యలు'

రైతు సగర్వంగా తలఎత్తుకొని బతికేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద పత్తి కొనుగోలు కేంద్రాన్ని, కోటకదిరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వమే కొంటుంది...

గతంలో చెల్లింపుల్లో జాప్యం, దళారుల బెడద ఉండేదని, వడ్డీ వ్యాపారులు రైతుల కల్లాలల్లోనే ధాన్యాన్ని అప్పు కిందకు తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వమే నేరుగా ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యంతో పాటు, మొక్కజొన్న, పత్తి వంటివి కొంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తామని చెప్పారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహబూబ్​నగర్ మండలంలో గోదామును నిర్మిస్తామని, కొత్త మార్కెట్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

12 కూడళ్లలో...

మహబూబ్​నగర్ పట్టణంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మూత్రశాలలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. జిల్లా కేంద్రంలో 12 కూడళ్లలో రూ. కోటి 50 లక్షలతో నిర్మించిన మూత్రశాలలను ప్రారంభించారు. రహదారుల విస్తరణకు కూడా ప్రజలందరూ సహకరిస్తే త్వరితగతిన పనులు పూర్తవుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్​నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ ​పవర్, ఆర్​డీఓ శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ కేసీ నరసింహులు, వైస్ ఛైర్మన్ గణేశ్​, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details