దట్టమైన అడవుల్లో ఉండాల్సిన కొండచిలువ వ్యవసాయ పొలంలో కనిపించేసరికి రైతులు, కూలీలు భయాందోళనకు గురయిన ఘటన మహబూబ్నగర్ జిల్లా లింగాయిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుక్కలి బుచ్చయ్య వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. ఓ కొండ చిలువ తారసపడింది. వెంటనే స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న "జీవ వైవిధ్య పరిరక్షణ అభివృద్ధి సమాఖ్య" సభ్యులు గ్రామస్థుల సహకారంతో కొండచిలువను పట్టుకున్నారు. పది అడుగులు ఉన్న కొండచిలువ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల నుంచి పంటపొలాలకు వచ్చి చేరిందని.. దీని వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొండచిలువను నల్లమల అడవిలో వదిలివేయనున్నట్టు తెలిపారు.
వ్యవసాయ పొలంలో కొండచిలువ
ఓ రైతు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా... ఓ కొండ చిలువ తారసపడింది. విషయం తెలుసుకున్న "జీవ వైవిధ్య పరిరక్షణ అభివృద్ధి సమాఖ్య" సభ్యులు గ్రామస్థుల సహకారంతో కొండచిలువను పట్టుకున్నారు.
వ్యవసాయ పొలంలో కొండచిలువ