రాష్ట్రవ్యాప్తంగా 63 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షా 90వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్ విడదల చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్షను చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరాహార దీక్ష
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 63 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షా 90వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్క రోజు నిరాహార దీక్షను చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరాహార దీక్ష
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల 2.84 లక్షల మంది అభ్యర్థుల వయస్సు మించిందని ఆయన అన్నారు. నిరుద్యోగుల బాధలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకే దీక్ష చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ నిరుద్యోగ భృతిని చెల్లించాలని.. ఉద్యోగాల భర్తీకి ఇయర్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు