మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఆటో డ్రైవర్గా పని చేస్తున్న కుమార్ మరో గుర్తు తెలియని యువతితో కలిసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీవీ కేబుల్వైరుతో ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మహబూబ్నగర్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య - love
యువతీ యువకుడు అనుమానాస్పదంగా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి చావుకు ప్రేమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన కలకలం రేపింది.
ప్రేమజంట ఆత్మహత్య
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఏడేళ్ల బాలుడి హత్య