తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదలో చిక్కుకుపోయిన పాఠశాల బస్సు.. 25 మంది విద్యార్థులు సేఫ్​.. - at mahaboobnagar latest news

Praivate School bus stuck in flood water but Students are safe at mahaboobnagar
Praivate School bus stuck in flood water but Students are safe at mahaboobnagar

By

Published : Jul 8, 2022, 10:03 AM IST

Updated : Jul 8, 2022, 11:01 AM IST

10:01 July 08

వరదలో చిక్కుకుపోయిన ప్రైవేటు పాఠశాల బస్సు

వరదలో చిక్కుకుపోయిన ప్రైవేటు పాఠశాల బస్సు

School Bus Stuck in Flood: మహబూబ్​నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెనుప్రమాదం తప్పింది. మాచన్​పల్లి-కోడూరు మధ్య ఓ ప్రైవేటు పాఠశాల బస్సు రైల్వే అండర్​ బ్రిడ్జిలో చేరిన వరదనీటిలో చిక్కుకుంది. రామచంద్రాపురం, సూగురుగడ్డ తండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు.. మార్గమధ్యలో వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది.

చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో అప్రమత్తమైన డ్రైవర్.. స్థానికులను సాయం కోరాడు. వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది విద్యార్థులుండగా.. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి..

Last Updated : Jul 8, 2022, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details