తెలంగాణ

telangana

ETV Bharat / state

చనిపోయింది కడుపు నొప్పితో కాదు... - mahabubnagar crime news

కడుపునొప్పి భరించలేక బలవన్మరణానికి పాల్పడిందో బాలిక. కానీ 5 నెలల పాటు దర్యాప్తు జరిపిన పోలీసులు బాలిక ఆత్మహత్య కారణం కడుపునొప్పి కాదని తేల్చారు. గర్భం దాల్చాక పెళ్లికి ప్రియుడు నిరాకరించడం వల్ల బలవన్మరణానికి పాల్పడిందని నిర్ధరించారు. చరవాణి, డీఎన్ఏ పరీక్షల ఆధారంగా  బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​లో జరిగింది.

police arrest A boy due to girl death in mahabubnagar
చనిపోయింది కడుపు నొప్పితో కాదు...

By

Published : Jan 31, 2020, 8:00 AM IST

Updated : Jan 31, 2020, 8:56 AM IST

మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ఓ తండాకు చెందిన బాలిక, 17 ఏళ్ల బాలుడు ఇద్దరూ ప్రేమించుకున్నారు. సాన్నిహత్యం పెరగడం వల్ల బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని ప్రియుడిని కోరింది. అందుకతను సమేమిరా అన్నాడు. తల్లిదండ్రులకు తెలుస్తుందన్న భయంతో బాలిక గత సెప్టెంబర్​లో ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందింది. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

డీఎన్​ఏతో నిందితుడి గుర్తింపు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్​మార్టం నిర్వహించగా.. బాలిక కడుపులో ఆరు నెలల పిండం ఉందని తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాలిక చరవాణి కాల్స్​ ఆధారంగా ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో వారి డీఎన్ఏ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపారు. ఆరుగురిలో ఒక బాలుడి డీఎన్​ఏ నమూనాలతో సరిపోలడం వల్ల బుధవారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కేసులో బాలిక, బాలుడు ఇద్దరూ 18 ఏళ్ల లోపు పిల్లలే.

ఇవీ చూడండి:కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు

Last Updated : Jan 31, 2020, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details