students harassment: రెండు జడలు వేసుకోలేదని విద్యార్థినులతో వందకు పైగా గుంజీలు తీయించారు వ్యాయమ ఉపాధ్యాయురాలు. టీచర్ ఆదేశించింది కదా అని విద్యార్ధులూ తమ శక్తిని మించి గుంజీలు తీశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మైనారిటీ గురుకుల విద్యాలయంలో ఈఘటన జరిగింది. అలా గుంజీలు తీసిన వారంతా తెల్లారే సరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు నడవలేని స్థితికి రాగా కొందరు జ్వరం బారిన పడ్డారు. దీంతో కొంతమంది విదార్థినులను ప్రిన్సిపల్ ఇంటికి పంపించారు. అయితే పీఈటీ తీరుపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు జడలు వేసుకోలేదని గుంజీలు.. అస్వస్థతకు గురైన విద్యార్థినులు - అస్వస్థతకు గురైన విద్యార్థినులు
students harassment: జడ్చర్ల బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. రెండు జడలు వేసుకోలేదని విద్యార్థినులను వ్యాయామ ఉపాధ్యాయురాలు గుంజీలు తీయించారు. దీంతో బాలికలు అస్వస్థతకు గురికావడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. విపరీతమైన కాళ్ల నొప్పులతో నడవడానికి ఇబ్బంది పడుతున్నామని విద్యార్థినులు తెలిపారు.
students harassment: