లబ్ధిదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి తిరిగి రీసైక్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలోని నిమ్మ బావిగడ్డ కాలనీలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్న వంశీ అనే వ్యాపారి కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్కడే సమీపంలోని ఒక అద్దె ఇంట్లో నిల్వ ఉంచాడు.
రేషన్ బియ్యం పట్టివేత - mahabubnagar district news
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి విక్రయిస్తున్న వ్యాపారిపై అధికారులు కేసు నమోదు చేశారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ వ్యాపారం విషయం తెలుసుకున్న జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎస్సై జయ ప్రసాద్ పట్టుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో వ్యవసాయ కోడె మృతి