తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒంటరి మహిళలకు అండగా పాలమూరు యంత్రాంగం.. స్వయం ఉపాధికి సాయం!

వేధింపులకు గురై భర్తకు దూరంగా ఉంటూ న్యాయం కోసం కోర్టులు, పోలీస్​స్టేషన్లు, పెద్ద మనుషుల చుట్టూ తిరిగే ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. భర్త నిరాదరణ వల్ల అత్తింట్లో ఉండలేరు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ కన్నవారికి భారం కాలేరు. పిల్లలుంటే వారి పోషణ సైతం సవాలే. సవాలక్ష సమస్యలతో మానసిక క్షోభకు గురవుతుంటారు. నిరుపేదలైతే వారి బాధలు వర్ణణాతీతం. అలాంటి అభాగ్యులైన ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తోంది మహబూబ్‌నగర్‌ జిల్లా యంత్రాంగం. రాష్ట్రంలోనే తొలిసారిగా సఖి కేంద్రం ద్వారా ఒంటరి మహిళలకు అండగా నిలుస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.

ఒంటరి మహిళలకు అండగా పాలమూరు యంత్రాంగం.. స్వయం ఉపాధికి సాయం!
ఒంటరి మహిళలకు అండగా పాలమూరు యంత్రాంగం.. స్వయం ఉపాధికి సాయం!

By

Published : Jun 21, 2022, 2:23 PM IST

ఒంటరి మహిళలకు అండగా పాలమూరు యంత్రాంగం.. స్వయం ఉపాధికి సాయం!

మహిళలు ఎదుర్కొనే లైగింక, మానసిక, భౌతిక, ఆర్థిక హింస నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను ప్రారంభించింది. వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు కౌన్సిలింగ్, న్యాయ సేవలు, పోలీసు సహాయం, వసతి, వైద్యసదుపాయాలను అందిస్తుంది. ఈసేవలు బాధిత మహిళలకు అందుతున్నా వారిలో ఏదో తీరని వెలితి. భర్త నుంచి దూరమైన మహిళలు సొంత సంపాదన లేక తల్లిదండ్రులపై ఆధారపడటం, వారి పిల్లల యోగాక్షేమాలు చూడటం పెనుసవాలుగా మారుతోంది. కేసు విచారణ, కౌన్సిలింగ్ నడుస్తూ భర్త నుంచి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళలకు అండగా నిలబడాలని నిర్ణయించింది మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం.

ప్రభుత్వ ఆర్థిక సాయంతో కుట్టమిషన్, గేదేలు, శారీ సెంటర్, లేడిస్ కార్నర్, కిరాణా దుకాణం లాంటి చిరువ్యాపారాలు మొదలు పెట్టారు. తమ కాళ్లమీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. స్వయం ఉపాధికి భరోసా కల్పించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా..రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంటరి మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచింది పాలమూరు జిల్లా యంత్రాంగం. దళిత బంధు లాంటి పథకాలను ఒంటరి మహిళలకు వర్తింపజేస్తే అద్భుత ఫలితాలుంటాయని సఖి కేంద్రం నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన, నైపుణ్య శిక్షణ ఇప్పించి వారి భవిష్యత్‌కు పునాదులు వేస్తున్నారు. భర్తకు దూరమైన మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం నింపేలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని కోరుతున్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా.. మొదట ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 100 శాతం రాయితీపై రుణాలిచ్చామని, మిగతా సామాజిక వర్గాలకు సైతం ప్రభుత్వ పథకాల్లో ఎక్కడ అవకాశముంటే అక్కడ లబ్ది చేకూర్చుతామని కలెక్టల్ వెంకట్రావు వెల్లడించారు.

ఇదీ చూడండి..

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య? సాయంత్రం అధికారిక ప్రకటన??

జోరుగా వర్షాలు... బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

ABOUT THE AUTHOR

...view details