తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2019, 7:41 PM IST

ETV Bharat / state

మళ్లీ పెరుగుతోన్న ఉల్లి ధరలు... రైతులకు ఊరట

రాష్ట్రంలో ఉల్లి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా వినియోగదారుల డిమాండ్ పెరగటం వల్ల ధరలు కాస్త పెరిగి అన్నదాతలకు ఉపశమనం కల్గిస్తున్నాయి. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో క్వింటాల్ ఉల్లి ధర రూ. 650 నుంచి 912 వరకు పలుకుంతోంది.

మళ్లీ పెరుగుతోన్న ఉల్లి ధరలు

మళ్లీ పెరుగుతోన్న ఉల్లి ధరలు
మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలో ప్రతి బుధవారం ఉల్లిని రైతులు దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో విక్రయిస్తుంటారు. గత 15 రోజుల కిందటి వరకు క్వింటా ఉల్లి ధర రూ.400 నుంచి 650 పలికింది. సాధారణంగా ఉగాది పండుగ సమయంలో ఉల్లిని అత్యధికంగా కొనుగోలు చేసి వినియోగదారులు నిల్వ చేసుకుంటుంటారు. ఈ సందర్భంగా ఉల్లి ధరలు కాస్త పెరగాలి. ఉల్లి క్రయ విక్రయాలు జరిగే ప్రధాన మార్కెట్లలో ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు అనుకున్న స్థాయిలో పెరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details